128 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, మాజీ మంత్రి, మహేశ్వరం శాసనసభ్యురాలు సబిత ఇంద్రారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గంలో గల జల్పల్లి మున్సిపల్ పరిధిలో ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డకు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారని, ఎవరైతే చెక్కులను లబ్ది పొందారో వారికి తులం బంగారం కూడా ఇవ్వాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గమును మీ అందరి సహకారంతో అభివృద్ధి చేసుకున్నామని, కానీ కొందరు స్వార్థపూరితంగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, తాన నియోజకవర్గం అభివృద్ధికై గతంలో మంజూరైన 250 కోట్ల నిధులు ఆపేశారని, ఆపేసిన స్పెషల్ ఫండ్ హెచ్ఎండిఏ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా అడిషనల్ ఫండ్ ను కూడా మంజూరు చేయాలని ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తిచేశారు.ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, బాలాపూర్ ఎమ్మార్వో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో చెక్కులను పంపిణి చేసిన మాజీ మంత్రి
