పెదనందిపాడు మండలం పుసులూరు గ్రామంలోని జిల్లా పరిషత్తు హైస్కూలులో పోషకాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాగులతో చేసిన పిండివంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
జావ వంటి రాగులతో తయారైన పదార్థాలు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఐరన్ శాతం పెరుగుతుందని టీచర్లు వివరించారు. ఆకుకూరలు, చిరుధాన్యాలు, పప్పు, కూరగాయలతో ఆహారం తీసుకోవడం వల్ల పోషకాహార లోపం నివారించవచ్చని తెలిపారు.
బయట నుంచి తెచ్చుకున్న న్యూడిల్స్ వంటి పదార్థాలు పిల్లల ఆరోగ్యానికి హానికరమని, ఇంట్లో తయారుచేసిన పోషకవిలువలతో కూడిన ఆహారం తీసుకోవడం మంచిదని సూచించారు.
టీచర్ కె. అన్నపూర్ణ మాట్లాడుతూ, పోషకవిలువలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు.
పోషకాహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి అనే సందేశంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు అందులో పాల్గొన్నారు.
హైస్కూల్ హెచ్ఎం ఎన్. రాంబాబు, ఏఎన్ఎం లూదుమేరీ, మహిళా పోలీస్ వి. సుజిత, ఎంఎల్‌హెచ్‌పీ లెనోరా క్వీన్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.