పుష్పగిరి కంటి వైద్య శిబిరం ద్వారా 46 మందికి ఉచిత శస్త్రచికిత్స

పుష్పగిరి కంటి ఆసుపత్రి, యస్ సొసైటీ ఉచిత కంటి వైద్య శిబిరంలో 46 మందికి శస్త్రచికిత్స నిర్వహించి ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందించారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి, యస్ సొసైటీ ఉచిత కంటి వైద్య శిబిరంలో 46 మందికి శస్త్రచికిత్స నిర్వహించి ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందించారు.

పుష్పగిరి కంటి ఆసుపత్రి విజయనగరం, యస్ సొసైటీ సహకారంతో కురుపాం మండలంలోని మూలిగూడ జంక్షన్ ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.

శిబిరంలో 120 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 46 మందిని శస్త్రచికిత్స నిమిత్తం విజయనగరం ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స పూర్తి చేశారు.

పుష్పగిరి ఆసుపత్రి CSR మేనేజర్ రమాదేవి, శస్త్రచికిత్స చేసిన రోగులకు ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందిస్తామని తెలిపారు.

శస్త్రచికిత్స అనంతరం రోగులను మూడు రోజుల తర్వాత తిరిగి స్వస్థలాలకు తీసుకెళతామని తెలిపారు. తరువాత కూడా ఫాలోఅప్ ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పారు.

ఈ శిబిరం ఏర్పాటుకు సహకరించిన యస్ సొసైటీ, స్థానిక యువత, బీయాల వలస పంచాయతీ సర్పంచ్ పువ్వుల అజ్జరీ, మాజీ సర్పంచ్ పట्टीకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పుష్పగిరి ఆసుపత్రి వైద్యులు వెంకటేష్, లిఖిత, భీమ శంకర్ తదితరులు ఈ శిబిరంలో ముఖ్య పాత్ర పోషించారు.

యస్ సొసైటీ కార్యదర్శి షేక్ గౌస్, కోఆర్డినేటర్ సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.

రాబోయే రోజుల్లో మరిన్ని మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తామని పుష్పగిరి ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *