పాలకొండ శివారు ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని అభ్యుదయ రైతు ఖంధపు ప్రసాదరావు గత బుధవారం స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో తెలియజేశారు. వెంటనే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే గత రెండు దినాలుగా తోటపల్లి ఎడమ కాలువకు ఎమ్మెల్యే సొంత నిధులతో జెసిబి ద్వారా ఎనిమిదో బ్రాంచ్ కాలువ పూడికతీత జంగిల్ క్లియరెన్స్ చెపుతారు. రేపటికి నరసింహ చెరువు పూడికి తీస్తే దీనిద్వారా పాలకొండకు నరసింహ చెరువులో ఐదు ముదుముల ద్వారా గొలుసు కొట్టు చెరువులకు నీరు చేరి 100 ఎకరాలు సాగుభూమికి 1000 ఎకరాలు సాగు భూమికి సాగునీరు అందుతుంది. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ చొరవకు ప్రసాదరావు ఎమ్మెల్యే జయ కృష్ణకు జలవనరుల శాఖ వారికి అభినందనలు తెలిపారు