పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురం, చిన మేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రాలలో స్టాఫ్ నర్సులు నిరసన వ్యక్తం చేశారు.
ఏ.యన్.ఎమ్ లకు ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా ఉద్యోగాలు కల్పించడం అన్యాయమని ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు.
స్టాఫ్ నర్సులు భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరసన చేపట్టి జీ.ఓ నంబర్ 115ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమ ఉద్యోగ భద్రతకు గండిపడుతోందని, ఏ.యన్.ఎమ్ లను నర్సులుగా నియమించడం వల్ల తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు.
స్టాఫ్ నర్సులు తమ డిమాండ్లు పరిష్కరించకపోతే దశలవారీగా నిరసనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
నిరసనలో భాగంగా, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరికి వినతిపత్రం అందించి సమస్యను పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు.
జీ.ఓ 115ను రద్దు చేయాలని, ఎలాంటి తక్షణ నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని నర్సులు పేర్కొన్నారు.
తమ హక్కుల కోసం పోరాడతామని, ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లి తగిన పరిష్కారం కోసం కృషి చేస్తామని స్టాఫ్ నర్సులు చెప్పారు.
