నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం తల్లి పాల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిసి సిడిపిఓ స్వరూప, ధర్మారం డాక్టర్ హరిప్రియ, ఆర్ ఐ గంగాధర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు తల్లి పాల యొక్క విశిష్టత గురించి అవగాహన కల్పించారు. ఆపై శ్రీమంతాలు అక్షరాభ్యాసం మరియు అన్నప్రాసన్న కార్యక్రమాలు నిర్వహించారు. సూపర్వైజర్ లక్ష్మీ, హెల్త్ సూపర్వైజర్ వసంత, పి హెచ్ ఏ రాణి మనోహర్, ఎం ఎల్ హెచ్ పి సంధ్య, మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు