హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌లోని వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్లర్‌పై జరిపిన దాడుల్లో ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి అమ్ముతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 ఎంఎల్ విస్కీ కలిపి విక్రయిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు.
ఈ ఐస్‌క్రీమ్‌లను పిల్లలు, యువత భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో తనిఖీలు నిర్వహించి ఐస్‌క్రీమ్ పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగరంలో ఇంకా ఎన్ని ఐస్‌క్రీమ్ పార్లర్లు ఉన్నాయి, ఇప్పటివరకూ జరిగిన విక్రయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇక ఈ విషయం బయటకు రావడంతో తరచూ అక్కడ ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసిన పిల్లల పేరెంట్స్ ఆందోలళ చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని చెబుతున్నారు.