ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్.బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి పోలీసులు, నక్సలైట్ల మధ్య తీవ్ర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో రెండు వైపులా కాల్పులు మోత మోగించాయి.
ఈ ఘటనలో పలువురు నక్సలైట్లు మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం అందింది. భద్రతా దళాలు ఒక ప్రముఖ నక్సలైట్ నాయకుడిని చుట్టుముట్టినట్లు సమాచారం.
బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ఈ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించారు. బీజాపూర్–గడ్చిరోలీ సరిహద్దు ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన తెలిపారు.
ALSO READ:ఆంధ్రప్రదేశ్‌లో 50 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులు – రూ.25,256 కోట్ల పెట్టుబడులకు శ్రీకారం
అయితే, ఇప్పటివరకు ఎంతమంది నక్సలైట్లు మృతిచెందారో ఖచ్చితమైన వివరాలు లేవని చెప్పారు. సెర్చ్ ఆపరేషన్ పూర్తయ్యాక స్పష్టమైన సమాచారం వెల్లడిస్తామని తెలిపారు.
గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో పోలీసులు భారీ కూంబింగ్ ఆపరేషన్‌లు చేపడుతున్నారు. ఇదే నేపథ్యంలో గరియాబంద్ జిల్లాలోనూ ఇటీవల నాలుగు గంటల పాటు పోలీసు–నక్సలైట్ కాల్పులు జరిగినట్లు తెలిసింది.
అప్పుడు నక్సలైట్లు అడవిలోకి పారిపోయారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నక్సలైట్ల కోసం భద్రతా బలగాలు తీవ్ర అన్వేషణ కొనసాగిస్తున్నాయి.
