Friday, July 24, 2026
Chat on WhatsApp
HomeCrime Newsఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయం వెలుగులోకి..! భయంతో ఆత్మాహుతి దాడి

ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయం వెలుగులోకి..! భయంతో ఆత్మాహుతి దాడి

-

Chat on WhatsApp

ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయలు  వెలుగులోకి వచ్చాయి. సోమవారం ఫరీదాబాద్ లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ గ్యాంగుకు చెందిన వ్యక్తే సోమవారం బాంబు పేలుడుకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

సహచరులు దొరికిపోవడంతో తాను కూడా పట్టుబడతాననే ఆందోళనకు గురైన నిందితుడు.. ఎర్రకోట వద్ద  భయంతో ఆత్మాహుతి దాడి జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఫరీదాబాద్ లో పట్టుబడిన అనుమానిత ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల వంటివే తాజా బాంబ్ బ్లాస్ట్ లో ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్ తో పాటు ఇంధనం ఉపయోగించి పేలుడు జరిపినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి :భారత్, రష్యా మధ్య కీలక ఒప్పందం..ఏకంగా 70 వేల  ఉద్యోగాలు

పేలుడు జరిగిన కారులో ఉన్న వ్యక్తిని “డాక్టర్ ఉమర్‌ మహ్మద్‌” గా పోలీసులు గుర్తించారు. సోమవారం పట్టుబడ్డ ఉగ్రవాద ముఠాకు, ఉమర్ మహ్మద్ కు సంబంధం ఉందని భావిస్తున్నారు.

పేలుడు జరిగిన సమయంలో కారులో ఉమర్‌తోపాటు ఇంకెవరైనా ఉన్నారా? అనే విషయం తెలుసుకోవడానికి దర్యాగంజ్, పహార్‌గంజ్ ప్రాంతాలలోని హోటళ్లు, లాడ్జిల ఎంట్రీలను తనిఖీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Chandrababu Naidu

Amaravati | చంద్రబాబు విజన్‌కు మరో రూపం.. అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ సెంటర్

Amaravati: అమరావతిని ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతి క్వాంటం వ్యాలీలో "క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్" ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం, పంజాబ్ నేషనల్...
- Advertisement -
Chat on WhatsApp