చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయన్ని తనిఖీ చేసి 2023-24 కు సంబంధించిన రికార్డులను జిల్లా సీఈఓ ఎల్లయ్య పరిశీలించారు, సిబ్బంది పనితీరు పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు, అనంతరం జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య మాట్లాడుతూ చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 2023 24 సంబంధించిన రికార్డులను పరిశీలించడం జరిగిందని సిబ్బంది పనితీరు బాగుందని, రికార్డులలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా రికార్డులన్నీ బాగున్నాయని ప్రతి సంవత్సరం కూడా రికార్డులు అన్నీ కూడా ఇదే విధంగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు, ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సూపరిండెంట్ మానయ్య, జూనియర్ అసిస్టెంట్లు ఉదయరాజు, గోపాల్, తదితరులు పాల్గొన్నారు
చిన్న శంకరంపేట ఎంపీడీవో కార్యాలయంలో రికార్డుల పరిశీలన
