అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనికీలలో 100 కేజీల గంజాయి పట్టుకోబడి కేసు నమోదైంది.
మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ రాతీలాల్ కోలి మరియు ఆకాష్ విలాస్ చవాన్‌లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి కారును మరియు గంజాయిని స్వాధీనపరచుకున్నారు.
చింతూరు సబ్ డివిజన్ పరిధిలో జూన్ 2024 నుండి 24 గంజాయి కేసులు నమోదుచేసి 64 మందిని అరెస్ట్ చేసి, 1,13,75,000/- రూపాయల విలువైన 2,275 కేజీల గంజాయిని స్వాధీనపరచినట్లు ఏ ఎస్ పి తెలిపారు.
అన్ని వాహనాలపై తప్సిలైన తనిఖీలు కొనసాగిస్తామని, అంతరాష్ట్ర పోలీసుల సహకారంతో ఇతర రాష్ట్రాల నుండి గంజాయి నిందితులను కూడా పట్టుకుంటామని పేర్కొన్నారు.