ఉసిరి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.
ఇది డయాబెటిస్ వంటి సమస్యలను తగ్గించి, నియంత్రిస్తుంది.
అయినా, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని అంటారు. ఉసిరి మోతాదు మించితే సమస్యలు వస్తాయి.
పరిమితికి మించి తీసుకోవడం వల్ల పేగుల సమస్యలు, అజీర్తి మొదలైన సమస్యలు రావచ్చు.
విటమిన్ సీ అధిక మోతాదుతో కాలేయంపై ప్రభావం చూపవచ్చు.
ఉసిరి మోతాదును పరిమితంగా తీసుకోవడం ఎంతో ముఖ్యం.ప్రతిరోజు సరైన మోతాదులో తీసుకుంటే, ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉంటాయి.