Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeFilms Newsరియల్ హీరో చిరంజీవి... సుహాసిని ఫ్లాష్‌బ్యాక్...

రియల్ హీరో చిరంజీవి… సుహాసిని ఫ్లాష్‌బ్యాక్…

-

Chat on WhatsApp

మెగాస్టార్ చిరంజీవిపై నటి సుహాసిని చేసిన ఆసక్తికర కామెంట్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1980వ దశకంలో ఎన్నో సినిమాల్లో చిరంజీవి, సుహాసిని హీరో హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా వాళ్ల సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను సుహాసిని గుర్తు చేస్తూ చిరును ప్రశంసించారు.  

ఒకసారి తాము షూటింగ్ కోసం కేరళలోని ఓ ప్రాంతానికి వెళ్లామని, ఆ సమయంలో కొందరు తాగుబోతులు కారును వెంబడించి బీరు బాటిల్స్ వేశారని, తమ ముందు కారులో వెళుతున్న చిరంజీవి అది చూసి కారు దిగి వాళ్లను గన్ తో బెదిరించారని, దీంతో వాళ్లంతా పారిపోయారని సుహాసిని చెప్పింది. హీరోయిజం అంటే కెమెరా ముందే కాదు.. రియల్ లైఫ్ లో కూడా అలాగే వుండాలి అంటూ చిరుపై సుహాసిని ప్రశంసలు కురిపించారు. 

ఈ సంఘటన మీకు గుర్తుందా? అని చిరంజీవి సుహాసిని అడగ్గా, ‘గుర్తుంది.. వాళ్లు మిమ్మల్ని వెంబడించడం అనూహ్య పరిణామం’ అని చిరు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియోను చిరు అభిమానులు షేర్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పటిది.. పూర్తి వీడియోను షేర్ చేయండి అని మరి కొందరు కామెంట్స్ లో కోరుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Crowd at Puri Jagannath Rath Yatra after a stampede incident in Odisha

Puri Jagannath Rath Yatra | జగన్నాథుడి రథయాత్రలో విషాదం.. 120 మందికి పైగా...

ఒడిశాలోని పూరీలో జరుగుతున్న శ్రీ జగన్నాథ రథయాత్ర(Puri Jagannath Rath Yatra) సందర్భంగా దుర్ఘటన చోటుచేసుకుని భక్తుల్లో విషాదాన్ని నింపింది. రథయాత్రను వీక్షించేందుకు భక్తులు పోటెత్తడంతో రద్దీ అదుపుతప్పి తొక్కిసలాట ఏర్పడింది. ఈ...
- Advertisement -
Chat on WhatsApp