ఆదోని మండలం పెద్ద తుంబలం పరిధిలో బళ్ళారి-రాయచూర్ హైవే రోడ్డు గుంతలుగా మారింది. వినాయక స్వామి ఆలయం దగ్గర PtoP కేబుల్ వర్క్ కోసం తవ్విన తర్వాత మట్టి లూజ్ అయి, వర్షంతో రోడ్డు పూర్తిగా బురదగా మారింది.
రైతులు తమ పంటను ఆదోని మార్కెట్‌కు తరలించేందుకు ఈ దారిని ఉపయోగించాల్సి వస్తుంది. అయితే, గుంతలున్న రోడ్డు వల్ల ట్రాఫిక్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.
వాహనదారులు, రైతులు ఆర్ అండ్ బి అధికారులపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
వర్షం పడిన ప్రతీసారి రోడ్డు మరింత నాశనం అవుతుండగా, దీనిని పట్టించుకునే వారు లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్ల మరమ్మత్తులు చేయాల్సిందిగా రైతులు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు.
ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం వల్ల వాహనాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు తమ పంటను సకాలంలో మార్కెట్‌కు తరలించలేకపోతున్నారని వాపోతున్నారు.
రోడ్లను వెంటనే మరమ్మతు చేసి, ప్రజలకు సురక్షిత రవాణా సౌకర్యం అందించాల్సిన అవసరం ఉందని వాహనదారులు కోరుతున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే ఆందోళన మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యను పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు మరమ్మతులు చేసి, ప్రజలకు సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల రోడ్ల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఇటువంటి సమస్యలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.