ఆదోని ఆర్టీసీ డిపో నందు నాలుగు ఆర్టీసీ నూతన బస్సులను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారు ప్రారంభించారు.
శుక్రవారం ఆర్టీసీ డిపో నందు డిపో మేనేజర్ ఆధ్వర్యంలో జరిగిన నూతన బస్సుల ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఈరోజు ఆదోనికి చాలా శుభపరిణాముని ఎమ్మెల్యే తెలిపారు.
ఎందుకంటే పాత బస్సులను తీసివేసి నూతన బస్సులను తీసుకోనివస్తున్నామన్నారు.
2 బస్సులు బెంగళూరు సిటికు,2 బస్సులు శ్రీశైలము నకు వెళ్తాయని అన్నారు.ఈ నూతన బస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.