కూటమి అంటే అభివృద్ధి.. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు తోనే సాధ్యమవుతుందని దీన్ని ఆకర్షితులై ఈరోజు వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలోకి చేరుతున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్లు సరోజ, వహిద్, స్వాతి, వైసీపీ మరియు సోషల్ మీడియా నాయకులు మన్సుర్ బాషా, జహీర్, వినయ్ లతో మాజీ కౌన్సిలర్ వహబ్ పాటు తదితరులు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి కౌన్సిలర్లు పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. గత ఐదేళ్ల నుండి టిడిపి పార్టీ కోసం కష్టపడిన నాయకులు కార్యకర్తలు ఉన్నారని, వారికి పార్టీ సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని, అదేవిధంగా పార్టీలో మోసం చేయాలని మోసపూరిత డ్రామాలు చేసిన వ్యక్తులు కూడా ఉన్నారని తెలిపారు.