నెల్లూరు 16వ డివిజన్ లో స్కూలు పక్కన 100 కుటుంబాలు నివసించే అపార్ట్మెంటు కు ముందు మరియు , రోజుకు షుమారు 2000 మంది వరకు ట్రావెల్స్ బస్సులు కోసం వేచి ఉండే సున్నితమైన ప్రాంతంలో .. ఏర్పాటు చేస్తున్న మద్యం షాపు ను నిరసిస్తూ మహిళలు చేస్తున్న ధర్నాలో వారితో కలిసి పాల్గొని సంఘీభవం తెలుపుతున్న ..
వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మరియు వైస్సార్సీపీ నాయకులు
నెల్లూరు 16 వ డివిజన్ జగదీష్ నగర్ లో జాతీయ రహదారి వద్ద మద్యం షాపు ఏర్పాటు ను.. నిరసిస్తూ స్థానిక మహిళలు ధర్నా చేపట్టారు. మహిళలు చేస్తున్న ధర్నాకు మద్దతుగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి.. వైసిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.. అక్కడకి వెళ్లి మహిళలతో కలిసి ధర్నాలో పాల్గొని వారికి సంఘీభావం తెలియజేశారు..
వారి కష్టాలలో వారితో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉంటామని….,వారి పోరాటానికి అండగా ఉంటూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..
తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చిన మద్యం పాలసీ వలన మద్యం షాపులు సంఖ్య పెరిగిపోతున్నాయని అధిక సంఖ్యలో ఇళ్ల మధ్య మద్యం షాపులు ఏర్పాటు చేయడాన్ని ప్రజలు నిరసిస్తూ.. ఎక్కడికక్కడ మహిళలు.. రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
జగదీష్ నగర్ లో 100 కుటుంబాలు ఉండే జనావాసాలు మరియు స్కూల్ మధ్య.. మద్యం షాపు ఏర్పాటు చేయడం.. చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు…
నిత్యం రద్దీగా ఉండే ఈ మెడికవర్ హాస్పిటల్ జాతీయ రహదారి కూడలి వద్ద.. మద్యం షాపు ఏర్పాటు చేస్తే.. అటు స్థానిక మహిళలు, విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
రోజుకు 2000 మంది వరకు వేచి ఉండే అతి సున్నితమైన ఈ జాతీయ రహదారి కూడలి లో మద్యం షాపు ఏర్పాటుతో ప్రమాదాలు పెచ్చు మీరే అవకాశం ఉందని అన్నారు.
మద్యం షాపులకు తాము కానీ తమ పార్టీ కానీ వ్యతిరేకం కాదని.. ప్రజలకు ఇబ్బంది లేని చోట మద్యం షాపు ఏర్పాటు చేసుకుంటే ఎవరికీ నష్టం లేదని పేర్కొన్నారు.
నిత్యం రద్దీగా ఉండే జగదీష్ నగర్ జాతీయ రహదారి వద్ద రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు 200 బస్సుల్లో ఎంతోమంది ఇక్కడి నుంచి రాక పోకలు చేస్తుంటారని అన్నారు.
ఇప్పటికైనా మంత్రి నారాయణ గారు స్థానిక ప్రజల ఇబ్బందులను గుర్తించి.. ఈ ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటును విరమించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్ , స్థానిక నాయకులు సగిల జయరామి రెడ్డి గారు, మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేని , కార్పొరేటర్లు వేలూరు మహేష్ గారు, ఊటుకూరు నాగార్జున , జయలక్ష్మి , వైసిపి నాయకులు నేతాజీ సుబ్బారెడ్డి , అబ్దుల్ మస్తాన్ ,మా భాషా , yasddanni , కరిముల్లా , ప్రభాకర్ మరియు పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు