ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్ల వద్ద కెమికల్ ట్యాంకర్ లారీ ని గ్రామస్తులు అడ్డుకున్నరు.గత రాత్రి రెండు లారీల్లో తీసుకొచ్చిన కెమికల్ ను మున్నేరు నీటిలో కలుపుతుండగా మత్స్యకారులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న గ్రామస్తులు మున్నేటిలో కెమికల్ కలపకుండా అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కెమికల్ లారీని స్టేషన్ కు తరలించారు.మున్నేరు నీటిలో కెమికల్ కలపడం వల్ల నీరు విషతుల్యమై పశువులు,గొర్రెలు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు చెపుతున్నారు.కెమికల్ కలిపిన నీరు మనుషులు త్రాగడం తో చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మున్నేరు లో కెమికల్ కలిపిన వారిపై చర్యలు తీసుకోవాలని గుదిమళ్ల గ్రామస్తులు కోరుతున్నారు.కెమికల్ లారీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మంలో కెమికల్ ట్యాంకర్‌ను అడ్డుకున్న గ్రామస్తులు
