పల్లెలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కురుపాం ఎమ్మెల్యే శ్రీమతి తోయక జగదీశ్వరి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో ఆదివారం నాడు కురుపాం మండలం ఉరిడి పంచాయితీలో గుంజరాడ గ్రామం నుండి ఉరిడి గ్రామం వరకు కోటి 50 లక్షలు నిధులతో బీటీ రోడ్డు, అలాగే గుజ్జువాయి పంచాయితీలో మంటికొండ గ్రామం నుండి చిన అంటిజోల గ్రామం వరకు కోటి 45 లక్షలు నిధులతో బీటీ రహదారి నిర్మాణానికి కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ప్రతి పల్లె రూపురేఖలను మార్చాలని లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమాన్ని రూపొందించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమామహేశ్వరి, ఈవోపిఆర్ డిఏ రమేష్ బాబు, ఉరిడి సర్పంచ్ ఆరిక లక్కయి, గుజ్జువాయి సర్పంచ్ హిమరిక నాగేశ్వరరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు, నియోజకవర్గ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి వెంపటాపు భారతి, వెలుగు మండల సమైక్య అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు కలిసేటి కొండయ్య, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శంకర్రావు, ట్రైబల్ రైట్స్ ఫోరం (టిఆర్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు రొబ్బా లోవరాజు, నాయకులు మంజు వాణి, తిరుపతి, యువరాజ్, రంజిత్ కుమార్ నాయకో, మధు, రాజేష్, జనసేన నాయకులు వంశీ, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.