ఈ విజయదశమిఉత్సవాలను రామగుండం నగరపాలక సంస్థ మేయర్ అనిల్ కుమార్ గారు అధ్యక్షత వహించారు. ఈ ఉత్సవాలకు మంచిర్యాల జిల్లా కలెక్టర్, పెద్దపల్లి జిల్లాకలెక్టర్ , సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్, సింగరేణి యూనియన్ నాయకులు, రామగుండం నగరపాలక సంస్థ కార్పొరేటర్లు కూడా అతిథులుగా హాజరు కాగా, సింగరేణి అధికారులు, ఉద్యోగులు కూడా కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో హాజరయ్యారు.
రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారు మాట్లాడుతూ
రామగుండం నియోజకవర్గం
ప్రజలకు విజయదశమి
దసరా శుభాకాంక్షలు
మీ కష్ట సుఖాలలో.
మీ ఆపదలో సంపదలలో
మీ బిడ్డగా… మీ తమ్మునిగా..
మీ అన్నగా.. మీ కుటుంబ
సభ్యులలో మీ పెద్ద బిడ్డగా
మీకు అండగా ఉంటా..!
నా ఈ జీవితం
రామగుండం నియోజకవర్గం
ప్రజలకే అంకితం..!
విజయ దశమి దసరా
ఉత్సవాలలో….
రామగుండం నియోజకవర్గం
శాసనసభ్యులు
మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్.
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, ఐటీ శాఖ శ్రీధర్ బాబు గారికి, సింగరేణి యాజమాన్యానికి ఇతర ప్రజా ప్రతినిధులందరికీ కృతజ్ఞత తెలియజేశారు.
మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మాట్లాడుతూ. రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచే దిశగా కృషి చేస్తానని. ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఈ దసరా ఉత్సవాలలో ఏర్పాటుచేసిన బాణసంచాలు, రావణ సుగుణ దహనం, జబర్దస్త్ షో సునామి సుధాకర్, శాంతి స్వరూప్, పటాస్ ప్రవీణ్ లతో ఆకర్షణంగా నిలిచాయి.
ఈ వేడుకలలో రామగుండం నగరపాలక ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, కార్పొరేషన్ అధ్యక్షులు, ఇతర కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీ అధికారులు, సింగరేణి ఉద్యోగ కుటుంబాలు, రామగుండం నియోజకవర్గం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.