విక్టరీ షోటోకాన్ కరాటే రామగుండం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 & 10 తేదీలలో లక్ష్మి నరసింహ గార్డెన్‌లో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. మాస్టర్ ఓడ్డేపల్లి సురేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం నుంచి 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గ్రేడింగ్‌లో అర్హత సాధించిన వారికి రెండవ రోజు బెల్ట్‌లు, సర్టిఫికెట్లు అందజేశారు.
గౌరవ అతిథులుగా రామగుండం ఏసీపీ మడత రమేష్, వీఎస్కేఏఐ గ్రాండ్ మాస్టర్ ఆర్. మల్లికార్జున్ గౌడ్, వీఎస్కేఏఐ చైర్మన్ సదా శివుడు, ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై రామకృష్ణ, ఎన్‌టిపిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా హాజరై విద్యార్థులను అభినందించారు. కరాటే విద్య సాధన ద్వారా శారీరక, మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, నాన్ చాక్, తల్వార్ విన్యాసాలు, టైల్స్ బ్రేకింగ్, కర్రసాము, లెగ్ బ్యాలెన్స్, కాటాస్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. వీటి ద్వారా విద్యార్థుల శిక్షణ స్థాయిని అధికారులు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్లు బోయపోతు రాము, ఓడ్డేపల్లి నవీన, ఓర్సు లక్ష్మణ్, బ్లాక్ బెల్ట్ కోహిళల మహేష్, రొడ్డ అక్షిత్, ముదంగుల గణేష్, సుద్దమల్ల నిఖిల్, స్పోర్ట్స్ పెగడపల్లి అశోక్ సహా తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులను, శిక్షకులను నిర్వాహకులు అభినందించారు.
