మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA–ఎంజీనరేగా)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్–గ్రామీణ్ (VB G RAM G)’ బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది.ఈ బిల్లుపై సభలో తీవ్ర చర్చ జరిగింది.
ALSO READ: Gujarat Bomb Threats | అహ్మదాబాద్‌లో పాఠశాలలకు బెదిరింపు ఈమెయిల్స్
విపక్షాలు బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిరసనకు దిగాయి. స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా, మెజారిటీ మద్దతుతో బిల్లు ఆమోదం పొందింది. ఓటింగ్ సమయంలో విపక్ష ఎంపీలు వెల్‌లోకి వెళ్లి నిరసన చేపట్టారు.
కొందరు సభ్యులు బిల్లు పత్రలను చించివేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
ఈ అంశంపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
అలాగే గత కాంగ్రెస్ పాలనలో ఉపాధి హామీ పథకం అమలులో లోపాలు ఉన్నాయని చౌహన్ ఆరోపించారు. 2009లో ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసమే పథకానికి గాంధీ పేరు జత చేశారని వ్యాఖ్యానించారు.
VB G RAM G Bill | ఉపాధి హామీకి గుడ్‌బై.. ‘VB జీ రామ్ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Lok Sabha session during VB G RAM G Bill approval
