UPI soon in Cambodia: భారతదేశ డిజిటల్ చెల్లింపుల(digital payments) వ్యవస్థ అంతర్జాతీయ పరిధిని విస్తరించుకుంటుంది. ఇండియా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ గ్లోబల్ విభాగం NIPL, కంబోడియాలో తొలి పబ్లిక్ లిస్టెడ్ కమర్షియల్ బ్యాంక్ ACLEDAతో భాగస్వామ్యం చేసుకుంది.
ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య క్రాస్ బోర్డర్ యూపీఐ–QR చెల్లింపులు అమల్లోకి రానున్నాయి. దింతో కంబోడియా పర్యటనకు వెళ్లే భారతీయులు, భారత్‌కు వచ్చే కంబోడియా పర్యాటకులకు డిజిటల్ చెల్లింపులు సులభం కానున్నాయి.
ALSO READ:Putin India Visit | ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం
ACLEDA బ్యాంక్, కంబోడియా నేషనల్ QR నెట్‌వర్క్ ‘Bakong (KHQR)’ను నిర్వహిస్తోంది. భాగస్వామ్యంతో భారత వినియోగదారులు UPI యాప్‌లతో కంబోడియాలోని 45 లక్షల KHQR మార్కెట్ పాయింట్లలో చెల్లింపులు చేయగలుగుతారు.
అదే విధంగా, కంబోడియా వినియోగదారులు తమ స్థానిక యాప్‌లతో భారత్‌లోని 7.09 కోట్ల UPI QR కోడ్‌లను స్కాన్ చేసి చెల్లించుకునే అవకాశం లభిస్తుంది.
ఈ భాగస్వామ్యం డిజిటల్ పేమెంట్(digital payments) కారిడార్లను బలోపేతం చేస్తుందని NIPL MD & CEO రితేష్ శుక్లా పేర్కొన్నారు.
ACLEDA బ్యాంక్ ప్రెసిడెంట్ ఇన్ చాన్నీ మాట్లాడుతూ, ఈ ఒప్పందం వేగవంతమైన, తక్కువ ఖర్చుతో డిజిటల్ చెల్లింపులను సాధ్యంచేసి ఆర్థిక నూతనతను పెంపొందిస్తుందని తెలిపారు.
2020లో స్థాపించబడిన NIPL, UPI మరియు RuPayను ఇతర దేశాల్లో అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. టెక్నాలజీ, లైసెన్సింగ్, కన్సల్టింగ్ ద్వారా ఇతర దేశాలకు డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతోంది.
ACLEDA బ్యాంక్ 61.8 లక్షల కస్టమర్లకు సేవలు అందిస్తూ, ACLEDA సూపర్ యాప్ ద్వారా 53.5 లక్షల మొబైల్ వినియోగదారులకు సేవలందిస్తుంది.
