తిరుమలలో శ్రీవారి ఫిబ్రవరి నెల దర్శన, సేవా కోటాల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ(TTD February Tokens) ప్రకటించింది.ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ ఆర్జిత సేవా డిప్‌ను అందుబాటులో ఉంచనున్నారు.ఆసక్తిగల భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.
21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా కోటా విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది.24వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం స్లాట్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శనం, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు మరియు దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం విడుదల కానున్నాయి.
ALSO READ:Lokesh Speed Policy: నారా లోకేష్ కొత్త పెట్టుబడి స్ట్రాటజీపై ఇన్వెస్టర్ల ఫిదా
తదుపరి రోజు అయిన 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల ఆన్‌లైన్ కోటా భక్తుల బుకింగ్ కోసం అందుబాటులోకి రానున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తుల సౌకర్యార్థం కోటాలను దశలవారీగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
