గ్రామాల మహర్దశ కూటమి ప్రభుత్వంతోనేనని టిడిపి సీనియర్ నాయకులు,మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ చెప్పారు.శుక్రవారం నాతవరం మండలంలో గల నాతవరం, మర్రిపాలెం, డి.ఎర్రవరం గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించి పలు సిసి రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జెడ్పిటిసి కరక సత్యనారాయణ మాట్లాడుతూ గత పాలకులు అభివృద్ధిని మర్చిపోయారని చెప్పారు .మండల టిడిపి పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాట్లాడుతూ అయ్యన్న అంటే అభివృద్ధి అనే పదానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం చేపడుతున్న పనులేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు నేతల విజయ్ కుమార్ సింగంపల్లి సన్యాసి దేవుడు మాజీ ఎంపీటీసీ అప్పిరెడ్డి మాణిక్యం ఎర్రవరం సర్పంచ్ సత్యవతి వివిధ గ్రామాల నుంచి వచ్చిన టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.