పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ మాధవరెడ్డి, పోలీస్ అమరవీరుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమరవీరులు చనిపోయిన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అమరవీరులకు నినాదాలు పలుకుతూ ఈ కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పార్వతిపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ ఇంతవరకు చనిపోయిన వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ పుష్పగుచ్చలతో చనిపోయిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెక్కులు పంపిణీ చేశారు.
పార్వతీపురంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి
