గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ పురస్కారాల్లో తెలంగాణ పోలీస్(Telangana Police Medals) శాఖ విశేషంగా నిలిచింది. రాష్ట్రానికి చెందిన మొత్తం 23 మంది సిబ్బందిని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలకు గాను కేంద్ర పతకాలకు ఎంపిక చేశారు.
విధి నిర్వాహణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి అందించే శౌర్య పతకాన్ని సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్‌రెడ్డి అందుకున్నారు. తన ప్రాణాలను పణంగా పెట్టి చూపిన సాహసానికి ఈ అత్యున్నత గౌరవం లభించింది.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం, రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలను ఇద్దరు అధికారులు పొందగా, ఉత్తమ సేవా పతకాలు 12 మందికి లభించాయి. ఐజీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది.
పోలీస్ విభాగంతో పాటు అగ్నిమాపక, జైళ్ల శాఖ, హోంగార్డుల విభాగాల సిబ్బందికీ కేంద్ర పతకాలు లభించాయి. ముఖ్యంగా గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన హోంగార్డులకు పతకాలు రావడం వారి అంకితభావానికి నిదర్శనమని ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది చేసిన సేవలకు ఈ పురస్కారాలు గుర్తింపుగా నిలిచాయి.
ALSO READ:CM Revanth Reddy on T-Hub | T-Hubను ప్రభుత్వ ఆఫీసులుగా మార్చొద్దు: సీఎం రేవంత్ రెడ్డి
