Telangana Jagruthi Local Elections | పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీకి తెలంగాణ జాగృతి సిద్ధం

telangana jagruthi local elections lion symbol telangana jagruthi local elections lion symbol

Telangana Jagruthi Local Elections: రాబోయే పురపాలక సంఘ ఎన్నికల్లో బరిలోకి దిగాలని తెలంగాణ జాగృతి నిర్ణయం తీసుకుంది. కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) నేతృత్వంలోని ఈ సంస్థ, మున్సిపల్ ఎన్నికలతో పాటు “మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లోనూ” అభ్యర్థులను నిలబెట్టేందుకు సిద్ధమవుతోంది.

ఇదిలా ఉండగా, రాజకీయ పార్టీగా నమోదు ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో, ఈ ఎన్నికల్లో “ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్ (AIFB)”కు చెందిన ‘సింహం’ గుర్తుతో పోటీ చేయాలని” తెలంగాణ జాగృతి నిర్ణయించినట్లు సమాచారం. ఈ అంశంపై AIFB రాష్ట్ర నాయకత్వంతో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి గుర్తు కోసం ఫార్వర్డ్‌ బ్లాక్ బీఫారంతో బరిలోకి దిగే అవకాశముందని ప్రచారం సాగుతోంది.

గతంలో ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని కవిత స్పష్టం చేసినప్పటికీ, “కార్యకర్తల నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో” ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి మున్సిపాలిటీలో సుమారు “20 నుంచి 30 స్థానాల్లో అభ్యర్థులను దింపేలా” వ్యూహరచన చేస్తున్నారని సమాచారం.

ఈ మేరకు హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆశావహులతో సమావేశాలు నిర్వహించారు.

మున్సిపల్ ఎన్నికల ద్వారా ప్రజల స్పందనను అంచనా వేసి, “భవిష్యత్తులో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలన్న లక్ష్యంతో” తెలంగాణ జాగృతి ముందుకు సాగుతున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

also read:Air India Plane Crash Insurance: బీమా సంస్థల నుంచి రూ.1,100 కోట్లకు పైగా చెల్లింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *