Paddy Bonus:వివిధ సంక్షేమ పథకాలకు భారీగా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.వివరాల్లోకి వెళ్తే
తెలంగాణ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు కోసం భారీగా నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.480 కోట్లను విడుదల చేస్తూ సంబంధిత శాఖలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
సన్న ధాన్యం బోనస్ చెల్లింపుల కోసం అత్యధికంగా రూ.200 కోట్లు కేటాయింపుచేయడం జరిగింది. రైతులకు వడ్ల బోనస్‌ను వేగంగా చేరవేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసినట్లు తెలిపింది.
also read:IT Employees New Labour Code: నెల 7వ తేదీలోగా సాలరీ తప్పనిసరి, కేంద్రం కీలక నిర్ణయం
మహాలక్ష్మి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పథకానికి రూ.60 కోట్లు విడుదల చేయగా, మిగిలిన రూ.220 కోట్లు మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించారు. ఈ మొత్తాన్ని మైనారిటీ విద్య, ఉపాధి, వృత్తిాభివృద్ధి, ఆర్థిక సహాయం వంటి పథకాలకు వినియోగించనున్నారు.
సంక్షేమ కార్యక్రమాల అమలు వేగవంతం చేయడం, లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూర్చడంలో భాగంగా ప్రభుత్వం ఈ భారీ నిధుల కేటాయింపును చేపట్టినట్లు తెలుస్తోంది.
