Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeMaharashtraMaharashtra Road Accident | డ్రైవర్‌కు గుండెపోటుతో అదుపుతప్పిన కారు.. ఐదురుగురి విషాద మృతి  

Maharashtra Road Accident | డ్రైవర్‌కు గుండెపోటుతో అదుపుతప్పిన కారు.. ఐదురుగురి విషాద మృతి  

-

Chat on WhatsApp

మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌(Ambernath)లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివసేన అభ్యర్థిని తీసుకెళ్తున్న కారు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు(Driver Heart Attack) రావడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై విరుచుకుపడింది. కారు డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ఐదు వాహనాలను వరుసగా ఢీకొట్టింది.

ఈ భయంకర ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు మొత్తం ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ALSO READ:Telangana Govt Funds Release: సంక్షేమ పథకాల కోసం రూ.480 కోట్ల మంజూరు

దుర్ఘటన జరిగిన సమయంలో డ్రైవర్ కాలు యాక్సిలరేటర్‌పై ఇరుక్కుపోవడంతో కారు వేగం మరింత పెరిగిందని పోలీసులు దర్యాప్తులో అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు వాహనాలను క్రేన్ సాయంతో తొలగించి ట్రాఫిక్‌ను సవ్యంగా నడిపించారు.

ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు అంబర్‌నాథ్ పోలీసులు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp