విజయనగరం జిల్లాలోని గుర్ల గ్రామంలో ప్రభలిన అతిసార వ్యాధి మరణాలతో మెంటాడ మండల తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెంటాడ తహసిల్దార్ కోరాడ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి గురువారం జయితి గ్రామంలో పర్యటించారు. మురుగు కాలువలు, అపరశుద్యాన్ని పరిశీలించారు. రక్షిత నీటి పథకాన్ని కూడా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాటర్ ట్యాంక్ పరిశుభ్రం చేశారా? లేదా ?అన్న విషయంతో పాటు గ్రామంలో పారిశుధ్యం ఎలా ఉందన్న విషయంపై దృష్టి సారించామని, అంతేకాకుండా గ్రామస్తులు ఆరోగ్యకర వాతావరణంలో జీవించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని కూడా వివరించామన్నారు. ఈ కార్యక్రమంలోవీఆర్వో రాంబాబు, ఏఎన్ఎం జగదీశ్వరి, ఆశా కార్యకర్తలు సతివాడ రాజేశ్వరి, దుల్ల సంతు, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
గుర్ల గ్రామంలో ఆరోగ్య పరిస్థితులను పరిశీలించిన తహసీల్దార్
