విజయనగరం టౌన్ లోని బాలాజీ కళ్యాణమండపంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ప్రభుత్వం ప్రకటించడంతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎక్స్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస రావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా, ఆయన ఆరు జిల్లాల ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే తెలియజేయాలనే బాధ్యత ఉందని తెలిపారు.
గాదె శ్రీనివాస రావు గత మూడుసార్లుగా ఎమ్మెల్సీగా గెలిచినందుకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.
2025లో మరోసారి తనకు మద్దతు అందించాలని, ఉపాధ్యాయుల సంక్షేమానికి తన సేవలను అంకితం చేయడానికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి పి ఆర్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు మెట్ట కృష్ణయ్య, ఏ ఎం గిరి ప్రసాద్ రెడ్డి వంటి ప్రముఖ ఉపాధ్యాయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
ఉపాధ్యాయుల సంక్షేమానికి ఈ సమావేశం ఎంతో దోహదపడుతుందని, విద్యా విధానాలను మెరుగుపరచడంపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు.