ఉత్తరాఖండ్‌లో సంచలన నిర్ణయం.. గంగోత్రి ధామ్‌లో అన్యమతస్థుల ప్రవేశంపై నిషేధం
Gangotri Temple Decision: ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రాల(Uttarakhand Temples) సాంస్కృతిక, మతపరమైన సంప్రదాయాలను కాపాడే దిశగా ఆలయ కమిటీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ‘దేవభూమి’గా ప్రసిద్ధి చెందిన ఈ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లోకి అన్యమతస్థుల ప్రవేశాన్ని నిషేధించే చర్యలు ప్రారంభమయ్యాయి. గంగోత్రి ఆలయ కమిటీ ఆదివారం నిర్వహించిన సమావేశంలో అన్యమతస్థుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నిబంధనలు గంగోత్రి ధామ్‌తో పాటు శీతాకాలంలో గంగామాత కొలువై ఉండే ముఖ్బా ప్రాంతానికీ వర్తిస్తాయని కమిటీ…
