pm modi wishes to cm revanth reddy

రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి దీర్ఘాయుష్మంతుడై ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ‘ఎక్స్‌’ వేదికగా సందేశం పోస్టు చేశారు. మోదీ సందేశం తర్వాత పలువురు కేంద్ర, రాష్ట్ర నేతలు కూడా సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే విధంగా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రేవంత్‌రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు, అభిమానులు కూడా సోషల్‌ మీడియాలో సీఎం రేవంత్‌రెడ్డి…

Read More
హైదరాబాద్ సైబర్ నేరగాళ్ల అరెస్ట్ – రూ.107 కోట్ల రికవరీ

సోషల్‌ మీడియా మోసాలపై సైబర్‌ పోలీసుల బిగ్‌ బ్రేక్‌ – రూ.107 కోట్ల రికవరీ

హైదరాబాద్‌: సోషల్‌ మీడియా మోసాలపై సైబర్‌ పోలీసులు బిగ్‌ బ్రేక్‌ అందించారు.సైబర్‌ మోసాలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి భారీ విజయం సాధించారు. పెట్టుబడులు, ఫోన్‌ కాల్స్‌, ఫేక్‌ యాప్‌లు, మెసేజ్‌ లింకుల ద్వారా అమాయకులను మోసం చేస్తున్న సైబర్‌ నేరగాళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. అక్టోబర్‌ నెలలో సైబర్‌ మోసాలకు సంబంధించిన 196 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న 55…

Read More
వరంగల్‌లో వందేమాతర గీతంతో ప్రారంభమైన వివాహ వేడుక

వివాహ వేడుకల్లో దేశభక్తి జల్లు – వందేమాతరతో ప్రారంభమైన పెళ్లి వేడుక

వరంగల్: జీవితంలో ఒక్కసారి జరిగే వివాహ వేడుకలోనూ దేశభక్తి ప్రతిధ్వనించింది. వరంగల్ నగరంలోని రంగశాయి పేటకు చెందిన కానిస్టేబుల్‌ గోగికార్‌ శ్రీకాంత్‌, లక్ష్మిసాయి ల వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. అయితే ఈ పెళ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివాహ వేడుకలో భాగంగా ‘వందేమాతరం’ గీతం రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పెళ్లి మండపంలోనే సామూహిక వందేమాతర గీతాలాపన నిర్వహించారు. వధూవరులు, బంధుమిత్రులు, అతిథులు అందరూ కలసి దేశభక్తితో గళం…

Read More
వరంగల్‌లో మోస్ట్ వాంటెడ్‌ సూరీ గ్యాంగ్‌ అరెస్ట్‌

వరంగల్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ సూరీ గ్యాంగ్‌ అరెస్ట్‌

WARANGAL:హైదరాబాద్‌ నగర బహిష్కరణకు గురైన మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దాసరి సురేందర్‌ అలియాస్‌ సూరీ  మరోసారి పోలీసుల వలలో చిక్కాడు. వరంగల్‌ పోలీసులు సూరీతో పాటు అతని గ్యాంగ్‌లో ఉన్న  ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు.  శుక్రవారం హనుమకొండలోని  వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌  మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం — సూరీ, హైదరాబాద్‌ పోలీసులు నగర బహిష్కరణ చేసిన తర్వాత వరంగల్‌ నగరం…

Read More
కర్నూలు జిల్లాలో వదిలేసిన పసిబిడ్డను తల్లితో కలిపిన మహిళా పోలీసుల దృశ్యం

Kurnool:కర్నూలు జిల్లాలో హృదయవిదారక ఘటన -ప్రభుత్వ ఆసుపత్రిలో పసిబిడ్డను వదిలేసిన తల్లి 

కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబా పేటలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కొణిదెల గ్రామానికి చెందిన శివమ్మ ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ అనంతరం కుటుంబ సమస్యల కారణంగా శివమ్మ చిన్నమ్మ శేషమ్మ పసిబిడ్డను ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటనతో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఆందోళన చెందారు. వెంటనే వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. సూచన అందుకున్న నందికొట్కూరు మహిళా పోలీసులు చురుగ్గా స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా…

Read More
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై మంత్రులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌ దిశానిర్దేశం 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌ దిశానిర్దేశం చేసారు.ప్రచారం ముగియకముందే ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలవాలని, ఈ మూడు రోజులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులకు సూచించారు. ప్రచారం 9న ముగియనుండటంతో ఒక్క రోజును కూడా వృథా చేయకూడదని స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన సమీక్షలో కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు….

Read More
రాష్ట్రంలో డిజిలాకర్‌ తరహా వ్యవస్థ రానుంది

రాష్ట్రంలో డిజిలాకర్‌ తరహా వ్యవస్థ రానుంది: డేటా ఆధారిత పాలనపై సీఎం చంద్రబాబు దృష్టి

కేంద్ర ప్రభుత్వ డిజిలాకర్‌ తరహాలోనే ప్రజలకు ఆధార్‌తో అనుసంధానమైన అన్ని పత్రాల వీక్షణ సౌకర్యం కల్పించే ప్రత్యేక వ్యవస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కుటుంబం యూనిట్‌గా ప్రతి పౌరుడి సమాచారం జియోట్యాగ్‌ చేయబడిందని, అన్ని శాఖలు ఆ డేటాను వినియోగించుకోవాలని సూచించారు. సచివాలయంలో ‘డేటా ఆధారిత పాలన’పై నిర్వహించిన సమావేశంలో మంత్రులు, కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, ఇకపై ప్రభుత్వ సేవలు 100% ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావాలని స్పష్టం చేశారు. “ప్రజలను…

Read More