హైదరాబాద్ విజయవాడ హైవేపై మంటల్లో కాలి బూడిదైన విహారీ ట్రావెల్స్ బస్సు

హైదరాబాద్–విజయవాడ హైవేపై బస్సులో మంటలు – డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన పెద్ద ప్రమాదం

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మరో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. విహారీ ట్రావెల్స్‌కు చెందిన ఒక ప్రైవేట్ బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా, చిట్యాల మండలం పిట్టంపల్లి సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజిన్ భాగం నుండి పొగ రావడం గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి, ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించారు. క్షణాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. డ్రైవర్…

Read More
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు ఘటన తర్వాత ఘటనాస్థలిని పరిశీలిస్తున్న అమిత్ షా

ఎర్రకోట పేలుడు ఘటనాస్థలాన్ని పరిశీలించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో భారీ కారు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, మరో 20 మందికి గాయాలు అయ్యాయి. హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన ఈ పేలుడు ప్రాంతాన్ని ఒక్కసారిగా దద్దరిల్లించింది. సమాచారం అందగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గాయపడిన వారిని తరలించిన లోక్‌నాయక్ ఆసుపత్రిని ఆయన సందర్శించి, బాధితులను పరామర్శించారు. అనంతరం ఢిల్లీ పోలీస్…

Read More

నెమ్మదిగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  పోలింగ్

నెమ్మదిగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  పోలింగ్ NOVEMBER 11 ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రారంభ రెండు గంటల్లో ఓటింగ్ నెమ్మదిగా సాగింది. ఉదయం 9 గంటల వరకు కేవలం 9.2 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో సగటున వందమంది వరకు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ వేగం నెమ్మదిగా ఉన్నప్పటికీ, సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉన్నందున, మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ శాతం పెరగొచ్చని ఎన్నికల అధికారులు అంచనా…

Read More
Supreme Court

జాతీయ రహదారుల ప్రమాదాలపై సుప్రీంకోర్టు ఆందోళన — NHAI, కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు

సుప్రీంకోర్టు జాతీయ రహదారుల్లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఇటీవల జరిగిన ప్రమాదాలపై స్వయంప్రేరిత విచారణ (సుమోటో) చేపట్టిన కోర్టు, రోడ్డు పరిస్థితులు దయనీయంగా ఉన్నప్పటికీ టోల్ చార్జీలు వసూలు చేయడాన్ని ప్రశ్నించింది. జస్టిస్ జె.కె. మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ, అనుమతి లేకుండా హైవేల వెంట ఉన్న దాబాలు ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొంది. ALSO READ:హనుమకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం –…

Read More
పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామంలో బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని నిరాహార దీక్ష చేస్తున్న రైతులు

పవన్ కళ్యాణ్ జోక్యం కోరిన పిఠాపురం రైతులు

పవన్ కళ్యాణ్ జోక్యం కోరిన పిఠాపురం రైతులు:కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామ ప్రజలు, రైతులు గత 12 సంవత్సరాలుగా పూర్తికాకపోయిన బ్రిడ్జి పనులపై ఆవేదన వ్యక్తం చేస్తూ “గోడు వినండి మహాప్రభూ” అంటూ నిరాహార దీక్ష చేపట్టారు. బ్రిడ్జి పనులు నిలిచిపోయిన కారణంగా దొంతమూరు, వెల్దుర్తి సహా పది గ్రామాల ప్రజలకు రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయని వారు వాపోయారు. రైతులు పేర్కొంటూ, “మేము పండించిన ధాన్యం ఇతర గ్రామాలకు తీసుకెళ్లడానికి తీవ్ర…

Read More
Pakistan planning terror bases near India in Bangladesh and Nepal

భారత్‌ సరిహద్దుల్లో ఉగ్రవాద విస్తరణకు పాక్‌ కొత్త కుట్రలు

భారత్‌ చుట్టుపక్కల ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాకిస్తాన్‌ కొత్త కుట్రలు పన్నుతోందని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం పాక్‌ మద్దతుతో ఉగ్ర సంస్థలు భారత్‌ సరిహద్దు దేశాలైన “నేపాల్‌, బంగ్లాదేశ్‌” ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలు, శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. భారత్‌-నేపాల్‌, భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులకు సమీపంలో ఈ శిబిరాలను నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, “ఆపరేషన్‌ సిందూర్‌” తర్వాత ఈ చర్యలు మరింత వేగం పుంజుకున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. బంగ్లా, నేపాల్‌ సరిహద్దు సమీప రాష్ట్రాల్లో…

Read More
Andhra Pradesh CM Chandrababu Naidu praises ministers for their efforts during Montha cyclone

చంద్రబాబు – తుఫాను సమయంలో కృషి చేసిన మంత్రులపై ప్రశంసలు

AMARAVATHI: సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల సంభవించిన “మొంథా తుఫాను” సమయంలో క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసిన మంత్రులను సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రతి మంత్రి స్వయంగా ప్రజల్లోకి వెళ్లి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా జరిగేలా కృషి చేశారని ఆయన ప్రశంసించారు. తుఫాను సమయంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించారని, అందువల్లే సహాయక చర్యలు అత్యంత వేగంగా పూర్తి చేయగలిగామని…

Read More