వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుటుంబం వద్ద రూ. లక్ష కోట్లు ఉన్నాయని ఆరోపించి, వరద సహాయ నిధిగా రూ. 2 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర విమర్శ

‘పదేళ్ల పాలనలో రూ.లక్ష కోట్లు వెనకేశారు.. రాష్ట్ర ప్రజలు వరదలతో అతలాకుతలం అవుతున్న ఈ పరిస్థితిలో కనీసం రూ.2 వేల కోట్లన్నా సీఎం సహాయ నిధికి ఇవ్వొచ్చు కదా’ అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. మంగళవారం ఉదయం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పర్యటించి వరద…

Read More
సీఎం రేవంత్ రెడ్డి, హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల పరిరక్షణ కోసం ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం.

రంగనాథ్‌కు మ‌రో కీల‌క బాధ్య‌త

ప్ర‌భుత్వ భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం, చెరువుల‌ను ర‌క్షించ‌డం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ)ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సంస్థ‌కు క‌మిష‌న‌ర్‌గా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న‌కు మ‌రో కీల‌క బాధ్య‌త‌ను అప్ప‌గించే యోచ‌న‌లో తెలంగాణ స‌ర్కార్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.   హెచ్ఎండీఏ ప‌రిధిలోని చెరువుల ప‌రిర‌క్ష‌ణ కోసం ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా రంగ‌నాథ్‌ను నియ‌మిస్తార‌ని స‌మాచారం….

Read More