ఎర్రకోట పేలుడు ఘటనపై రాజ్నాథ్ సింగ్ స్పందన – నిందితులకు కఠిన శిక్షలు తప్పవు
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. భద్రతా వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై ఇప్పటికే సమగ్ర విచారణ ప్రారంభించాయని ఆయన వెల్లడించారు. ఘటన వెనుక ఉన్న నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. “ఇలాంటి చర్యలు దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు. ఎవ్వరూ చట్టానికి అతీతులు…
