
టీడీపీ కార్యాలయ దాడి కేసులో వైసీపీ నేతలకు షాక్
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలకు నిరాశ ఎదురయింది. వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేశ్ తదితరులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరికి బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. 2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. కూటమి అధికారంలోకి…