జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: కేరన్ సెక్టార్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలమైంది. కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టార్‌లో చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. పక్కా నిఘా సమాచారం ఆధారంగా నవంబర్ 7న సైన్యం ఆపరేషన్ ప్రారంభించింది. మొదటగా భద్రతా దళాలు అనుమానాస్పద కదలికలను గుర్తించగా, వెంటనే ప్రతిస్పందించి కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాది ఇంకా నక్కి ఉండొచ్చని సైన్యం అనుమానిస్తోంది. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. ALSO READ:రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని…
