భారత్‌లో నాలుగు ప్రధాన ప్రభుత్వ బ్యాంకుల విలీనం ప్రణాళిక

భారత్‌లో ఇకపై నాలుగు ప్రధాన బ్యాంకులే.. ప్రభుత్వ ప్రణాళిక సిద్ధం

భారత బ్యాంకింగ్ రంగంలో మరోసారి పెద్ద మార్పు రానుంది. కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ విలీనం 2.0 (Bank Merger 2.0) కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళిక అమలులోకి వస్తే, దేశంలో కేవలం నాలుగు ప్రధాన ప్రభుత్వ బ్యాంకులు “స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), మరియు నరా బ్యాంక్ మాత్రమే మిగిలే అవకాశం ఉంది. ఈ విలీనాల ప్రధాన ఉద్దేశ్యం బ్యాంకింగ్ వ్యవస్థను…

Read More

ఐటీ షేర్ల దన్నుతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు

ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ప్రారంభించాయి. ముఖ్యంగా ఐటీ రంగం షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరవచ్చన్న సానుకూల అంచనాలు మదుపరుల విశ్వాసాన్ని మరింత పెంచాయి. ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 727.81 పాయింట్లు పెరిగి 85,154.15 వద్దకు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 188.6 పాయింట్లు లాభపడి కీలకమైన 26,000 మార్కును అధిగమించి 26,057.20…

Read More

దీపావళి వెలుగుల్లో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ!

దీపావళి పండగ రోజు భారత స్టాక్ మార్కెట్లు లాభాల వెలుగుల్లో మెరిశాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్ల ఉత్సాహం స్పష్టంగా కనిపించగా, కీలక సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. పాజిటివ్ గ్లోబల్ సెంటిమెంట్స్, బలమైన సంస్థాగత కొనుగోళ్లు మార్కెట్‌ను మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. సెన్సెక్స్ 660 పాయింట్లకు పైగా ఎగిసి 84,614 వద్ద నిలవగా, నిఫ్టీ 191 పాయింట్లు లాభపడి 25,901 మార్క్‌ను తాకింది. బ్యాంకింగ్, హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్లు బలంగా ఉండటంతో సూచీలకు బలమైన…

Read More

ఇన్ఫోసిస్ మధ్యంతర డివిడెండ్‌ బంపర్‌ – నారాయణ మూర్తి కుటుంబానికి రూ. 347 కోట్లు!

దేశీయ ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా ప్రకటించిన మధ్యంతర డివిడెండ్‌తో సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుటుంబానికి భారీ లాభం దక్కనుంది. కంపెనీ ఒక్కో షేరుకు రూ. 23 చొప్పున డివిడెండ్ ప్రకటించగా, కేవలం మూర్తి కుటుంబానికే సుమారు రూ. 347.20 కోట్లు అందనున్నట్లు అంచనా. ఇన్ఫోసిస్ ఇటీవల ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల అనంతరం ఈ డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్‌ పొందడానికి అక్టోబర్ 27ని రికార్డ్ డేట్‌గా నిర్ణయించగా, నవంబర్ 7న…

Read More

GST Reforms 2025: సోమవారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి – ధరలు తగ్గనున్న వంటసామాన్లు, ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాలు

దేశవ్యాప్తంగా పన్నుల వ్యవస్థలో భారీ సంస్కరణలు చోటు చేసుకున్నాయి. సోమవారం నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం, మొత్తం 375 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు అమలు కానుంది. దీంతో వంటసామాన్ల నుంచి ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాలు, రోజువారీ వినియోగ ఉత్పత్తుల వరకు ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. వంటగది అవసరాలు చౌక:నెయ్యి, పన్నీరు, నమ్‌కీన్, కెచప్, జామ్, డ్రై ఫ్రూట్స్,…

Read More

ట్రంప్ ఆరోపణల వెనుక నిజం ఏంటి? ‘టారిఫ్ కింగ్’ వివరణ!

‘‘భారత్ టారిఫ్ కింగ్’’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పదే పదే ఆరోపించారు. కానీ ఆయన వ్యాఖ్యల వెనుక వాస్తవాలు ఏంటి? నిజంగానే భారత్ ప్రపంచంలో అత్యధిక సుంకాలను విధిస్తున్నదా? ఈ వీడియోలో ట్రంప్ ఆరోపణలకు గణాంకాలతో సమాధానం చెబుతున్నాం. వరల్డ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం భారత్ సాధారణ సగటు సుంకం 15.98% అయినప్పటికీ, వాణిజ్య ఆధారిత సగటు సుంకం కేవలం 4.6% మాత్రమే. అంటే భారత్ చాలా తక్కువ సుంకాలను మాత్రమే వసూలు చేస్తోంది….

Read More