Mumbai Kali temple | ముంబైలో కలకలం కాళీమాత విగ్రహాన్ని మేరీమాతగా మార్చిన పూజారి
ముంబై శివారు చెంబూర్‌లోని అనిక్ విలేజ్‌లో ఉన్న కాళీమాత ఆలయంలో విగ్రహాన్ని మేరీమాత రూపంలోకి మార్చిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆలయ పూజారి కాళీమాత నల్లటి విగ్రహానికి తెలుపు రంగు పూసి, బంగారు వస్త్రాలు, కిరీటం, సిలువ వంటి క్రైస్తవ చిహ్నాలను జోడించాడు. అమ్మవారి చేతిలో శిశువు ఏసును పోలిన బొమ్మను కూడా ఉంచడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే దీనిపై భక్తులు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. ALSO READ:కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం…
