అక్రమ మైనింగ్ భీభత్సం.. కూలిన బొగ్గు గని….కార్మిక కుటుంబాల్లో ఆందోళన ?
West Bengal Coal Mine: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అసన్సోల్ ప్రాంతంలో బొగ్గు గనిలో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. బోర్డిలా పరిసరాల్లో ఉన్న గని అకస్మాత్తుగా కూలిపోవడంతో అక్కడ పని చేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారని సమాచారం. ఘటన విషయం తెలియగానే పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ప్రస్తుతం శిథిలాలను తొలగిస్తూ కార్మికులను బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే గనిలో మొత్తం ఎంతమంది కార్మికులు ఉన్నారన్న…
