ఏపీలో భారీ వర్షాల వల్ల తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. స్వామివారి దర్శనం 6 గంటలలో పూర్తవుతుంది. సోమవారం 63,936 మంది భక్తులు దర్శించుకొని రూ.4.55 కోట్లు హుండీ ఆదాయం.

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది

ఏపీలో భారీ వ‌ర్షాల కార‌ణంగా తిరుమ‌ల‌కు భ‌క్తుల ర‌ద్దీ భారీగా త‌గ్గిపోయింది. గ‌త రెండుమూడు రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ర‌వాణా వ్య‌వ‌స్థకు అంత‌రాయం ఏర్ప‌డ‌డంతో భ‌క్తుల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. దీంతో మునుప‌టి మాదిరి స్వామివారి ద‌ర్శ‌నానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌డం లేదు. కేవ‌లం 6 గంట‌ల్లోనే శ్రీవారి ద‌ర్శ‌నం పూర్తవుతోంది.  ఉచిత సర్వదర్శనం కోసం భ‌క్తులు ఐదు కంపార్టుమెంట్లలో మాత్ర‌మే వేచి ఉన్నారు. అటు టైమ్‌ స్లాట్‌ (ఎస్‌ఎస్‌డీ) ద‌ర్శ‌నం కోసం మూడు…

Read More

వరద బాధితులకు ఆహారం… సీఎం చంద్రబాబు ఆదేశాలు

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండొద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతీ ఒక్కరికీ ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు మంగళవారం అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. వరద బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. సహాయక విధుల్లో నిమగ్నమైన అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మంగళవారం ఉదయం నుంచి జరిగిన ఆహార పంపిణీ వివరాలపై అధికారులను ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 హెలికాఫ్టర్లతో ఆహార…

Read More
బెంగళూరులో ఓ మహిళ, ఆమె కుమార్తె కలిసి ఇంటింటి తిరిగి పెళ్లి నిధుల కోసం స్కాం చేస్తున్నారు. 15 వేలు కావాలని చెప్పి, సహాయం చేయమని కోరుతున్నారు.

బెంగళూరులో పెళ్లి స్కాం…. మహిళ, బాలికల దుర్వినియోగం

బెంగళూరులో ఇప్పుడు ఓ కొత్తరకం స్కాం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన 15 ఏళ్ల కుమార్తెతో కలిసి ప్రతి ఇల్లు తిరుగుతూ తలుపు కొడుతుంది. కుమార్తెను చూపిస్తూ ఈ పక్కనే ఉన్న గుడిలో పెళ్లి జరగాల్సి ఉందని, అందుకు రూ. 15 వేలు తగ్గాయని, దయచేసి సర్దాలని వేడుకుంటుంది. పెళ్లి కూతురులా ముస్తాబై ఉన్న బాలికను చూసి నిజమే కాబోలని కొందరు అంతో ఇంతో సర్దుతున్నారు. ఇలానే తనకు ఎదురైన అనుభవాన్ని ‘కేవీఏకే95’ అనే రెడిట్…

Read More
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుటుంబం వద్ద రూ. లక్ష కోట్లు ఉన్నాయని ఆరోపించి, వరద సహాయ నిధిగా రూ. 2 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర విమర్శ

‘పదేళ్ల పాలనలో రూ.లక్ష కోట్లు వెనకేశారు.. రాష్ట్ర ప్రజలు వరదలతో అతలాకుతలం అవుతున్న ఈ పరిస్థితిలో కనీసం రూ.2 వేల కోట్లన్నా సీఎం సహాయ నిధికి ఇవ్వొచ్చు కదా’ అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. మంగళవారం ఉదయం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పర్యటించి వరద…

Read More
సీఎం రేవంత్ రెడ్డి, హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల పరిరక్షణ కోసం ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం.

రంగనాథ్‌కు మ‌రో కీల‌క బాధ్య‌త

ప్ర‌భుత్వ భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం, చెరువుల‌ను ర‌క్షించ‌డం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ)ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సంస్థ‌కు క‌మిష‌న‌ర్‌గా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న‌కు మ‌రో కీల‌క బాధ్య‌త‌ను అప్ప‌గించే యోచ‌న‌లో తెలంగాణ స‌ర్కార్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.   హెచ్ఎండీఏ ప‌రిధిలోని చెరువుల ప‌రిర‌క్ష‌ణ కోసం ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా రంగ‌నాథ్‌ను నియ‌మిస్తార‌ని స‌మాచారం….

Read More
ఫ్రాన్స్‌లో దారుణం: 10 ఏళ్ల పాటు భార్యపై 92 అత్యాచారాలు Description: ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తి 10 ఏళ్లపాటు తన భార్యపై 92 సార్లు అత్యాచారాలు చేశాడు. అత్యాచారాలకు 72 మంది వ్యక్తులు సంబంధం ఉన్నారు.

ఫ్రాన్స్‌లో దారుణం…. 10 ఏళ్ల పాటు భార్యపై 92 అత్యాచారాలు

యావత్ ఫ్రాన్స్ దేశాన్ని నిర్ఘాంతపరిచే ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన భార్యపై 10 ఏళ్లపాటు ఏకంగా 92 అత్యాచారాలు చేపించాడు. భార్యకు అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చి.. ఆమె మత్తులో ఉన్న సమయంలో ప్రైవేటు అపరిచిత వ్యక్తులతో ఈ దురాగతాలు చేయించాడు. ఆన్‌లైన్‌లో రిక్రూట్‌ చేసుకున్న వ్యక్తులతో ఈ దారుణాలకు పాల్పడ్డాడు. ఈ మేరకు నమోదైన ఆరోపణలపై నిందితుడు డొమినిక్ సోమవారం కోర్టు విచారణకు హాజరయ్యాడు. కాగా బాధితురాలిపై మొత్తం 72 మంది వ్యక్తులు…

Read More

హర్యానాలో దారుణం: 12వ తరగతి విద్యార్థిని కాల్చి హత్య

హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని భ్రమపడి 12వ తరగతి విద్యార్థిని 30 కిలోమీటర్లు వెంటాడి కాల్చి చంపారు. ఆగస్టు 23న జరిగిన ఈ ఘటనకు సంబంధించి గో సంరక్షణ గ్రూపులోని ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అనిల్ కౌశిక్, వరుణ్, కృష్ణా, ఆదేశ్, సౌరభ్‌గా గుర్తించారు. బాధితుడు ఆర్యన్ మిశ్రా, ఆయన స్నేహితులు షాంకీ, హర్షిత్‌లను నిందితులు పశువుల స్మగ్లర్లుగా పొరబడి ఈ దారుణానికి తెగబడ్డారు. ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై కారులో…

Read More