
స్వీపర్ పోస్టుకు గ్రాడ్యుయేట్ల దరఖాస్తులు.. నిరుద్యోగం ఘనత..
దేశంలో నిరుద్యోగిత ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదేమో. హర్యానాలో ఓ స్వీపర్ పోస్టుకు వేలాదిమంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు పోటీపడ్డారు. కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగాలకు హర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్ లిమిటెడ్ (హెచ్‌కేఆర్ఎన్) దరఖాస్తులు ఆహ్వానించింది. 1.2 లక్షల మంది అండర్ గ్రాడ్యుయేట్లు కూడా..నోటిఫికేషన్ వచ్చీరావడంతోనే 39,990 మంది గ్రాడ్యుయేట్లు, 6,112 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరు కాకుండా ఆగస్టు 6 నుంచి సెప్టెంబరు 2 మధ్య…