మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టు బెయిల్ నిరాకరణ, కేసు కొనసాగింపు.

టీడీపీ కార్యాలయ దాడి కేసులో వైసీపీ నేతలకు షాక్

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలకు నిరాశ ఎదురయింది. వైసీపీ  నేతలు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేశ్ తదితరులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరికి బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. 2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. కూటమి అధికారంలోకి…

Read More
ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నసీఫ్ యూసఫ్ దర్శకత్వం వహించిన మలయాళ థ్రిల్లర్ 'ఇరుల్,' సెప్టెంబర్ 6న ఆహా తమిళ్‌లో స్ట్రీమింగ్.

తమిళంలో ‘ఇరుల్’ మిస్టరీ థ్రిల్లర్

మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమాలకు .. అలాగే అక్కడి క్రైమ్ థ్రిల్లర్ .. మిస్టరీ థ్రిల్లర్ సినిమాల పట్ల ఇతర భాషా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపుతుంటారు. అందువలన ఎప్పటికప్పుడు ఈ తరహా కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ఓటీటీ సంస్థలు పోటీపడుతూ ఉంటాయి. అలా ఓటీటీ తెరపైకి వస్తున్న మరో మిస్టరీ థ్రిల్లర్ ‘ఇరుల్’.  మలయాళంలో రూపొందిన ఈ సినిమాకి నసీఫ్ యూసఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించాడు. ఆంటోని జోసఫ్ నిర్మించిన…

Read More
జియో రూ.1,889 ప్లాన్‌: 336 రోజుల అపరిమిత కాల్స్, 24GB డేటాతో రూ.173/నెల చొప్పున అద్భుత ప్రయోజనాలు.

జియో కొత్త ప్లాన్లతో కస్టమర్ల ఆకర్షణ

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ వంటి టెలికం ఆపరేటర్లు ఇటీవల రీఛార్జ్ రేట్లను గణనీయంగా పెంచడంతో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లక్షలాది మంది యూజర్లు పోర్ట్ అయ్యారంటూ కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యగా టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త వ్యాల్యూ యాడెడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. అపరిమిత కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలను అందించే ఆఫర్లను జియో ఆవిష్కరించింది. సాధారణంగా కాలింగ్, డేటా బెనిఫిట్స్…

Read More
బంగ్లా చేతిలో 2-0 సిరీస్ ఓటమి పాక్ టెస్టు ర్యాంకింగ్స్‌లో పతనాన్ని చూపించింది. పాక్ 6వ నుంచి 8వ స్థానానికి పడిపోయింది.

బంగ్లాదేశ్ చేతిలో ఓటమితో పాకిస్థాన్ జ‌ట్టుకు ఊహించ‌ని షాక్

స్వ‌దేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్ జ‌ట్టుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు టెస్టు ర్యాంకింగ్ ఏకంగా రెండు స్థానాలు ప‌త‌న‌మైంది. ఈ సిరీస్‌కు ముందు 6వ స్థానంలో ఉన్నా ఆ జ‌ట్టు ప్ర‌స్తుతం 8వ‌ స్థానానికి ప‌డిపోయింది.  ఇటీవ‌ల జ‌రిగిన రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను షాన్ మ‌సూద్ సారథ్యంలోని పాక్ జ‌ట్టుపై బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసిన విష‌యం తెలిసిందే. తొలి టెస్టులో పాకిస్థాన్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన బంగ్లా,…

Read More
బుడమేరులో 90% ఆక్రమణ విజయవాడకు శాపమైందని, సీఎం చంద్రబాబు సమర్థవంతంగా పని చేస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశంసించారు.

బుడమేరులో జరిగిన ఆక్రమణల గురించి పవన్ కల్యాణ్ విమర్శలు

బుడమేరులోని 90 శాతం ఆక్రమణకు గురైందని, ఇదే ఇప్పుడు విజయవాడకు శాపంగా మారిందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు సమర్థవంతంగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు. ఈ వయస్సులో కూడా జేసీబీలు, ట్రాక్టర్లను ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బాగా పని చేస్తుంటే ప్రశంసించాల్సింది పోయి వైసీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ముందు…

Read More
'ఎమర్జెన్సీ' చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వమని కంగన విజ్ఞప్తి చేసినా, బాంబే హైకోర్టు అది చేయలేమని తేల్చిచెప్పింది.

ఎమర్జెన్సీ సినిమాపై కంగనాకు హైకోర్టులో షాక్

ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు బాంబే హైకోర్టులో షాక్ తగిలింది. ఆమె స్వయంగా దర్శకత్వం వహించి, నటించి, నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని కేంద్ర సెన్సార్ బోర్డును తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో సెప్టెంబర్ 18వ తేదీ లోపు ఒక నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. మాజీ ప్రధాని…

Read More
హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించిన విప్లవ్ సిన్హాను పోలీసులు అరెస్టు చేశారు. రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది.

హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించిన విప్లవ్ సిన్హా అరెస్ట్

‘హైడ్రా చీఫ్ రంగనాథ్ నాకు బాగా క్లోజ్.. రూ.20 లక్షలు ఇస్తే హైడ్రా బుల్డోజర్లు మీ నిర్మాణాల జోలికి రాకుండా చూస్తా.. లేదంటే కూల్చేయిస్తా’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక కార్యకర్తనని, సామాజిక సేవకుడినని చెప్పుకుంటూ విప్లవ్ సిన్హా అనే వ్యక్తి అమీన్ పూర్ లో బిల్డర్లను బెదిరించాడు. తనకు డబ్బులు ఇవ్వకుంటే మీడియాలో మీ నిర్మాణాల గురించి అసత్యాలు రాయించి, హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో బిల్డర్లు…

Read More