ప్రపంచకప్ విజేత క్రికెటర్ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్‌లో ఘన స్వాగతం
విజయవాడలో క్రికెటర్ శ్రీచరణి అడుగుపెట్టగానే ఘన స్వాగతం లభించింది. మహిళా వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీచరణి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), శాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆమెకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టు విజయానికి శ్రీచరణి కీలక పాత్ర పోషించిందని…
