భూపాలపల్లి జిల్లాలో 97 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పేదలకు కేటాయించిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ముఠాపై అధికారులు దాడి చేశారు. సివిల్ సప్లై శాఖ మరియు టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో నాలుగు వాహనాల్లో తరలిస్తున్న 97 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు నేతృత్వంలో అధికారులు రేగొండ మండలం బాగిర్తిపేట క్రాస్ రోడ్ వద్ద వాహనాలను ఆపి తనిఖీ చేయగా, పెద్ద మొత్తంలో రేషన్…
