Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeTelanganaJayashankar Bhupalpalleభూపాలపల్లి జిల్లాలో 97 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

భూపాలపల్లి జిల్లాలో 97 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

-

Chat on WhatsApp

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పేదలకు కేటాయించిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ముఠాపై అధికారులు దాడి చేశారు. సివిల్ సప్లై శాఖ మరియు టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో నాలుగు వాహనాల్లో తరలిస్తున్న 97 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్ ఫోర్స్ అదనపు సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు నేతృత్వంలో అధికారులు రేగొండ మండలం బాగిర్తిపేట క్రాస్ రోడ్ వద్ద వాహనాలను ఆపి తనిఖీ చేయగా, పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం బయటపడింది.

ALSO READ:తెలంగాణ జానపద కళాకారులతో కవిత సమావేశం

గత కొద్ది రోజులుగా ఈ ముఠా రేషన్ బియ్యాన్ని దొంగ దారిన తరలిస్తూ లాభాలు సంపాదిస్తున్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో చర్యలు చేపట్టారు.

స్వాధీనం చేసిన బియ్యంపై కేసు నమోదు చేసిన అధికారులు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేదలకు చెందాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలించేవారిపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Minister Nara Lokesh distributing house pattas to beneficiaries in Mangalagiri

Mana Illu- Mana Lokesh | మంగళగిరిని రాష్ట్రానికే రోల్ మోడల్ చేస్తాం: నారాలోకేష్  లోకేశ్

మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపేలా అభివృద్ధి చేస్తానని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. 'మన ఇల్లు-మన లోకేశ్'(Mana Illu- Mana Lokesh) కార్యక్రమంలో భాగంగా మంగళగిరి, తాడేపల్లి మండలాలకు...
- Advertisement -
Chat on WhatsApp