గన్నవరం వద్ద భారీ వర్షాల కారణంగా రాకపోకలు నిలిపివేసిన ఎస్సై రామారావు, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నర్సీపట్నం-తుని రాకపోకలు నిలిపివేత

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద…. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోమవారం స్థానిక ఎస్సై ఎం.రామారావు అన్నారు. నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద వెర్రీగెడ్డ కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి ప్రవహించడంతో నర్సీపట్నం నుంచి తుని వైపు వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిపివేసమని ఎస్సై రామారావు అన్నారు. నర్సీపట్నం నుంచి తుని వెళ్లేవారు మాకవరపాలెం మీదుగా వెళ్లాలని ఆయన సూచించారు. తుని నుంచి వచ్చే వాహనాలను…

Read More
అల్లూరి జిల్లాలో వినాయక మండపంలో నాగుపాము ప్రత్యక్షమై భక్తులను ఆశ్చర్యపరిచింది. దైవ సంకల్పమంటూ భక్తులు భారీగా తరలివచ్చారు.

వినాయక మండపంలో నాగుపాము ప్రత్యక్షం, భక్తుల ఆసక్తి

అల్లూరిజిల్లా హుకుంపేట మండలం తాడిపుట్టు గ్రామంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో అద్భుతం చోటు చేసుకుంది. గ్రామస్తులు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయగా పాలవెల్లిలో ఓ నాగుపాము ప్రత్యక్షమై చాలాసేపు అక్కడే ఉంది. ఈ మండపంలో జరిగిన ఘటనతో భక్తులు ఆశ్చర్యపోయారు ఇది కచ్చితంగా దైవ సంకల్పం అంటున్నారు స్థానికులు ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Read More
తుఫాను వలన రేగిడి మండలంలో వరద, పంటలు ముంపు. టిడిపి నాయకుల పర్యవేక్షణలో బ్రిడ్జి శుద్ధి, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.

రేగిడి మండలంలో వరద ప్రభావం, పంట పొలాలు ముంపు

విజయనగరం జిల్లా, రాజాం నియోజకవర్గం, రేగిడి ఆమదాలవలస మండలం లో గత రెండు రోజులుగా తుఫాన్ కారణంగా ఎడతెరిపిలేని వర్షాలు కురవడం వలన, ఒక ప్రక్కన నాగావళినది ఉదృతం మరియు ఆకులు కట్ట గడ్డ పొంగడం మండలంలో వెంకటాపురం, కోడిస వెళ్లే రహదారి ఏ కే ఎల్ గడ్డ ద్వారా తుఫాను కారణంగా వచ్చే వరద వలన బ్రిడ్జి దగ్గర గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలు బ్రిడ్జికి అడ్డంగా ఉండటం వలన. పంట పొలాలు ముంపికి గురి…

Read More
అల్పపీడనంతో ఉత్తర కోస్తా ఆంధ్ర, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, వరద ముప్పు. పలు రోడ్లు మూసివేత, విద్యా సంస్థలకు సెలవు.

ఆంధ్ర‌లో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రా, గోదావరి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై రోడ్డు రవాణాకు అంతరాయం క‌లుగుతోంది. ఉమ్మ‌డి జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరుసగా రెండోరోజు సోమవారం కూడా ఎడ‌తెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో భారీగా వ‌ర‌ద‌నీరు పోటెత్తి రోడ్లు, పొలాలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వ‌స్తున్న వ‌ర‌ద‌నీరు కార‌ణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి….

Read More
బుడమేరు గండ్లు పూడ్చేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో ఆర్మీ సిబ్బంది చేరుకున్నారు. ఇనుపరాడ్లతో వంతెన నిర్మాణం చేపట్టనున్నారు.

బుడమేరు గండి పూడ్చే పనుల్లో ఆర్మీ సాయం

విజయవాడ వరదలకు ప్రధాన కారణంగా నిలిచిన బుడమేరుకు మూడు చోట్ల గండ్లు పడిన సంగతి తెలిసిందే. మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రింబవళ్లు తేడా లేకుండా బుడమేరు కట్టపై మకాం వేసి, గండ్లు పూడ్చే పనులను పర్యవేక్షిస్తున్నారు.  జోరున వాన కురుస్తున్నా ఆయన కట్ట మీద నుంచి పక్కకి రాకుండా, సిబ్బందితో పనులు చేయిస్తున్నారు. నిమ్మల బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న, రాత్రి భోజనాలన్నీ బుడమేరు కట్టపైనే చేస్తున్నారు. ఇప్పటికే నిమ్మల ఆధ్వర్యంలో రెండు గండ్లు విజయవంతంగా పూడ్చారు.  ఇక,…

Read More
ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో వరద నష్ట అంచనా, సహాయక చర్యలకు కేంద్రం నిపుణుల బృందాలు పంపి, 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్లు సిద్ధం.

తెలుగు రాష్ట్రాల కోసం కేంద్రం నుండి పూర్తి సహకారం

ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సహాయక చర్యలపై ఎక్స్ వేదికగా కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వరద ప్రాంతాలకు ఇప్పటికే నిపుణుల బృందాన్ని పంపించినట్లు తెలిపింది. వరదలు, డ్యాంలు, వాటి భద్రతను కేంద్ర బృందం పరిశీలిస్తుందని వెల్లడించింది. వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది….

Read More
కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు అని సీబీఐ నిర్ధారించింది, దర్యాప్తు తుది దశలో.

కోల్‌కతా హత్యాచారం కేసులో ఒక్కరే నిందితుడు అని నిర్ధారించిన సీబీఐ

గత నెలలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు అని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. లభ్యమైన సాక్ష్యాధారాలన్నీ సంజయ్ రాయ్‌ ఒక్కడే నిందితుడని సూచిస్తున్నాయంటూ సీబీఐ వర్గాలు చెప్పాయని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం పేర్కొంది. విచారణ చివరి దశలో ఉందని, త్వరలోనే ఛార్జిషీట్లు కూడా దాఖలు…

Read More