Akhanda 2 Success Meet | అఖండ 2 భారతీయులందరి సినిమా నందమూరి బాలకృష్ణ
Akhanda 2: డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన “అఖండ 2” సినిమా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా విజయోత్సవ వేడుకల్లో భాగంగా బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, చిత్ర బృందం వారణాసిని సందర్శించింది. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ‘అఖండ 2’ కేవలం తెలుగు సినిమా కాదని, భారతీయులందరికీ సంబంధించిన చిత్రమని…
